తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పై ఫ్రొఫెసర్ కోదండరాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం కేసీఆర్ ఆడుతున్న రాజకీయ నాటకమని ఆరోపించారు. కేవలం తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ వాదాన్ని, అస్థిత్వాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారన్నారు. ఢిల్లీ స్థాయిలో తెలంగాణ మోడల్ డొల్లతనాన్ని బయటపెడతామని స్పష్టం చేశారు కోదండరాం.
తెలంగాణ ప్రజల సమస్యలను, ఇచ్చిన హామీలను తీర్చే శక్తిని కేసీఆర్ కోల్పోయారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అనుకుంటున్న వాళ్లు కూడా డబ్బు పంచి గెలిచే ప్రయత్నమే చేయడం దురదృష్టకకరమని అన్నారు కోదండరాం.
టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయాన్ని నిర్మిస్తామని చెప్పిన బీజేపీ లీడర్ రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో లక్షలు, కోట్లు కుమ్మరిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. జీఎస్టీని తగ్గిస్తానని కేంద్రం నుంచి ఒక్క హమీని కూడా తీసుకురాలేక పోయారన్నారు. మునుగోడులో తెలంగాణ జన సమితి పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు తెలంగణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం.