క్రెడిట్ కార్డు” మన జీవితాన్ని ఏ విధంగా అయినా మార్చేస్తుంది. అప్పుల పాలు చేయొచ్చు… మనల్ని కష్టాల నుంచి బయటకు తెచ్చి ఆదుకోవచ్చు. ఇక క్రెడిట్ కార్డు విషయంలో అవగాహన లేక చాలా మంది నష్టపోతూ ఉంటారు. క్రెడిట్ కార్డుని సవ్యంగా వాడుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి గాని మనం మాత్రం సవ్యంగా వాడుకునే ప్రయత్నం చేయం. ఇక క్రెడిట్ కార్డు సరిగా వాడితే ఏమవుతుంది…?
Also Read:బాదుడే.. బాదుడు.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
మంచి క్రెడిట్ హిస్టరీ తయారు అవుతుంది. బిల్ పేమెంట్స్ ఫుల్ గా, టైంకి కడితే సిబిల్ స్కోర్ చాలా బాగా మెరుగవుతుంది. భవిష్యత్తులో హోమ్ లోన్ లాంటివి తీసుకుంటే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది.
Frauds/Merchant disputes జరిగినప్పుడు మనకు బ్యాంకు నుంచి సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది.
వచ్చే రివార్డ్ పాయింట్స్ మనకు ఉపయోగపడతాయి. ఫ్లైట్స్/హోటల్స్ కి వాటిని చాలా బాగా వాడుకోవచ్చు.
ఇక ఎయిర్పోర్ట్ లౌంజ్ యాక్సిస్ మనకు ఉచితం గా ఉంటుంది. ఫ్లైట్ కి టైం ఉంటే భోజనం చేసి , రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టు.
క్రెడిట్ కార్డు వాడే విషయంలో మనం ఒక అంశాన్ని మర్చిపోవద్దు. దాన్ని అప్పు ఇచ్చే టూల్ మాదిరిగా వాడితే మాత్రం ప్రమాదమే. గ్రేస్ పీరియడ్ తర్వాత పేమెంట్ చేస్తే చాలా ఎక్కువ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. దాదాపుగా 24% శాతం వడ్డీ పడుతుంది. ఇక కాష్ విత్ డ్రా చేయడం నిజంగా అతిపెద్ద తప్పు. ఇంటరెస్ట్ రేట్ 24% – 42% వరకు ఉంటుంది.
Also Read:పాక్ కు భారత యాత్రికులు… ఐదేండ్లలో ఎంత మంది అంటే ?