సినిమా విడుదల తేదీని ప్రకటించినప్పటికీ, “ప్రాజెక్ట్ కె” లో అనేక మార్పులు జరుగుతున్నాయి. సంగీత దర్శకుడి మార్పు గురించి పుకార్లను ధృవీకరిస్తూ, నిర్మాత అశ్విని దత్ ఒక ఇంటర్వ్యూలో.. తమిళ సంగీత దర్శకుడు, ఓ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రాజెక్ట్-కె కు పనిచేస్తారని కన్ ఫర్మ్ చేశారు.
“ప్రాజెక్ట్ కె” అనేది ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా, ఇందులో దీపికా పదుకొనే ప్రధాన పాత్ర పోషిస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన “ప్రాజెక్ట్ కె”లో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కూడా నటిస్తున్నారు.
నాగ్ అశ్విన్ రెగ్యులర్ గా, మిక్కీ జె మేయర్ తో వర్క్ చేస్తాడు. కానీ పరిస్థితులు మారిపోయాయి. “కబాలి”, “దసరా” చిత్రాలకు పనిచేసిన సంతోష్ నారాయణన్ ను ప్రాజెక్ట్-కె కోసం తీసుకున్నారు. పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇతడే ఇస్తాడు. ఒక పాటను మాత్రం బాలీవుడ్ మహిళా కంపోజర్ చేస్తారు.
“ప్రాజెక్ట్ కె” జనవరి 12, 2024న విడుదల కానుంది. ఇండియాలోనే అతి పెద్ద సినిమా ఇది.