కుటుంబ సభ్యులపై కోపంతో ఓ రైతు తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. మద్యప్రదేశ్ లోని చిద్వాడాకు చెందిన ఓం నారాయణ వర్మ రైతు తన ఆస్తిలో సగభాగాన్ని తన పెంపుడు కుక్క అయిన జాకీ పేర నోటరీ చేయించాడు. మరో సగభాగాన్ని తన రెండో భార్య అయిన చంపాబాయ్ పేర రాశాడు.
ఓం నారాయణ వర్మ కు మొత్తం 21 ఎకరాల ఆస్తి ఉంది. మొదటి భార్యకు ముగ్గురు పిల్లలు, రెండో భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ……రెండో భార్య మరియు పెంపుడు కుక్క మాత్రమే తనతో ప్రేమగా ఉండేవారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు వర్మ! పెంపుడు కుక్క విషయంతో…దాని బాధ్యతలు ఎవరు తీసుకుంటూ….ఆ కుక్క పేర రాసిన ఆస్తి వారికే చెందుతుందనే నోట్ ను కూడా పెట్టాడు వర్మ!