బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జరిగిన అల్లర్లకు సంబంధించి యూపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 200కు పైగా మందిని పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో మొత్తం 68 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హత్రాస్ లో 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు శహరాన్ పూర్ నుంచి 48 మంది, అంబేద్కర్ నగర్ నుంచి 28 మంది, మొరాదాబాద్ లో 25 మంది, ఫిరోజాబాద్ నుంచి ఎనిమిది మంది అరెస్టైన వారిలో ఉన్నారు.
అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సేకరించిన వీడియో పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. మరి కొందరిని అరెస్టు చేయనున్నట్టు పోలీసులు చెప్పారు.
సంఘ విద్రోహ శక్తులపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వారికి తగిన గుణపాఠం చెప్పాలని పోలీసులను ఆదేశించినట్టు పేర్కొంది.