జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేషాలపల్లె గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై ఆందోళన చెలరేగింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని మాజీ జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళీ డిమాండ్ చేశారు.
ఆయన ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద గ్రామస్తులు నిరసన చేపట్టారు. తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని వారంతా నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో నిరసన చేస్తోన్న మురళీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయినప్పటికీ జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు పోలీస్ స్టేషన్లో నే బైఠాయించి నిరసన తెలుపుతామని ఆకునూరి మురళీ స్పష్టం చేశారు.