రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై దళిత వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం క్షమాపణలు చెప్పే దాకా ధర్నాలు, దీక్షలు కొనసాగిస్తామని అంటున్నాయి. సీఎం ప్రెస్ మీట్ తర్వాత నుంచి ఇప్పటిదాకా చాలా గ్రామాల్లో కేసీఆర్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నాయి.
తాజాగా.. నారాయణపేట నియోజకవర్గం మరికల్ మండల కేంద్రంలో రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా శవయాత్ర నిర్వహించారు బీఎస్పీ నేతలు. కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేకి అంటూ నినాదాలు చేశారు.
రాజ్యాంగంపై సీఎం చేసిన వ్యాఖ్యలకు మద్దతిస్తూ మాట్లాడుతున్న టీఆర్ఎస్ నేతలపైనా బీఎస్పీ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ ఫోటోతోపాటు వారికి కూడా శవయాత్ర చేశారు.
కేటీఆర్, కేసీఆర్, బాల్క సుమన్, చంటి క్రాంతి కిరణ్, గువ్వల బాలరాజు, మంత్రి జగదీష్ రెడ్డి, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు ఫోటోలకు శవయాత్ర చేసి.. బొందపెట్టారు బీఎస్పీ నేతలు. నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.