పౌరసత్వ చట్టానికి వ్యతిరేకించే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. వాళ్లు పాకిస్థాన్ లో హింసకు, వేధింపులకు గురైన వారికి ఊరట నిస్తుంటే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. పాకిస్థాన్ మతం ప్రాతిపదికన ఏర్పడింది… అందుకే అక్కడ మైనార్టీలైన హిందూ, సిక్కు, క్రిస్టియన్లపై వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక్కడ పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించే కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడవు? మత ప్రాతిపదికన వేధింపులు, మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించ వచ్చు కదా అని ప్రశ్నించారు. పార్లమెంట్ లో పౌరసత్వ చట్టం తీసుకురావడం ఓ చారిత్రాత్మకం…దాన్ని వ్యతిరేకించడమంటే వ్యవస్థను వ్యతిరేకించడమే అని అన్నారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందూ, క్రిస్టియన్, సిక్కులను ఇండియాను నుంచి వెళ్లగొట్టి వాళ్ల అదృష్టానికి వదిలి వేయలేం…వారిని రక్షించుకోవడం దేశ భద్రత అన్నారు ప్రధాన మంత్రి. అంతే గాక జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఆ రాష్ట్రంలో అస్థిరత్వాన్ని, ఉగ్రవాదాన్ని అంతం చేశామని చెప్పారు.