లక్షల ఉద్యోగాలన్నారు.. నోటిఫికేషన్ల జాడలేదు. మరి.. ఎన్నాళ్లని వెయిట్ చేస్తారు. టీఆర్ఎస్ నాయకులు ఎవరు కనిపించినా నిలదీస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా కొందుర్గులో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డిని నిరుద్యోగులు నిలదీశారు. కాన్వాయ్ కి అడ్డం పడ్డారు.
బీజేవైఎం కార్యకర్తలతో కలిసి నిరుద్యోగులు మంత్రుల కార్లను అడ్డగించారు. ఉద్యోగాల హామీని అమలు చేయాలని నినాదాలు చేశారు. అలాగే స్థానికంగా ఉన్న రోడ్ల దుస్థితిపైనా మంత్రులను నిలదీశారు. నియోజకవర్గంలోని లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రులను నిరుద్యోగులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.