వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ ముందు ఉద్రిక్తత నెలకొంది. మల్లమోనిగూడ గ్రామస్తులు బస్టాండ్ ముందు ధర్నాకు దిగారు. దసరా వేడుకల్లో గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండో వర్గం ఓ మహిళపై దాడికి పాల్పడింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు మొదటి వర్గంవారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
ఈ ధర్నాలో మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు నిరసనకారులతో చర్చలు జరిపారు. ఆ సమయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవకు టీఆర్ఎస్ నాయకుడే కారణమంటూ ఎమ్మెల్యే రావాలంటూ నినాదాలు చేశారు మహిళలు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా నిరసన చేపట్టారు.