మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశరాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. శర్మపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే విషయమై ముస్లీం సంఘాలు ఆగ్రహం వ్యక్తి చేస్తున్నాయి.
తాజాగా.. బీజేపీ బహిష్కృత నేత నుపూర్ శర్మను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. మహబూబ్‌నగర్‌లో ముస్లింలు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక మదీనా మసీద్ నుంచి క్లాక్‌టవర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు.
ఈ ర్యాలీలో జాతీయ జెండాపై అశోకచక్రం స్థానంలో అరబిక్ లో రాతలు రాసి ప్రదర్శన చేశారు. గమనించిన పోలీసులు ఆరిఫ్ బిల్లా, మహ్మద్ ఇమ్రాన్, నయ్యద్ నవీద్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నేషనల్ అనర్ యాక్ట్ కింద కేను నమోదు చేశారు.
అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దేశవ్యాప్తంగా దుమారంగా రేకెత్తిస్తోంది. జాతీయ జెండాను అవమానించారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వివాదం హిందూ, ముస్లిం ఘర్షణలకు దారి తీసే ప్రమాదం ఉందంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.