గొల్లకురుమలు, యాదవులను కించపర్చేలా వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి తమకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయా కులాల నిరసనకారులు డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీస్తున్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గొల్ల కురుమలు, యాదవులు ధర్నా నిర్వహించారు. ఈక్రమంలోనే రేవంత్ రెడ్డి పోస్టర్లోని అతని ముఖంపై దున్నపోతుల పేడ కొట్టి నిరసన వ్యక్తం చేశారు. తరువాత భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇక వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి, ఆయన పార్టీకి తాము తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా నిరసనకారులు హెచ్చరించారు. కాగా, పేడ పిసుక్కుని బతికిన తలసాని శ్రీనివాస్ యాదవ్ నా గురించి మాట్లాడుతాడా అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
దాంతో తమ జాతులను అవమానించారంటూ గొల్లకురుమలు, యాదవులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బేషరతుగా మా జాతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.