రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీఎం తీరును ఖండిస్తూ దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ.. క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ ను వినిపిస్తున్నాయి.
ఇటు సీఎం వ్యాఖ్యలను సమర్ధిస్తున్న టీఆర్ఎస్ నేతలపైనా మండిపడుతున్నాయి దళిత సంఘాలు. కేసీఆర్ కు మద్దతుగా మాట్లాడిన వారంతా దళిత ద్రోహులని సమత సైనిక్ దళ్, అంబేద్కర్ యువజన సంఘం ఆరోపించాయి.
వెంటనే వారంతా రాజీనామా చేయాలని.. కేసీఆర్ భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని సమత సైనిక్ దళ్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సీఎంతోపాటు ఇతర ఎమ్మెల్యేల దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఇటు రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం ముందు సమతా సైనిక్ దళ్ నిరసన వ్యక్తం చేసింది. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు సభ్యులు.