ఇద్దరు మంత్రుల మధ్య ప్రోటోకాల్స్ వార్ ముదురుతున్నట్లు కనపడుతోంది. మెట్రో కారిడార్ ఓపెనింగ్ కోసం తన నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌తో ఓపెనింగ్ చేస్తూ… కేంద్రమంత్రినైనా తనకు కనీసం ఆహ్వానం కూడా పంపకపోవటంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారులు రాజకీయకుట్రలో భాగం కావద్దంటూ హెచ్చరించారు.
అయితే, రైల్వే ఓపెనింగ్ ప్రోగ్రాంపై కిషన్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు తెలంగాణమంత్రి తలసాని. మీరు ప్రోటోకాల్ పాటించలేదని రాజకీయ విమర్శలు చేశారు. మరీ నా నియోజకవర్గంలో కేంద్రమంత్రి పర్యటిస్తూ, పలు రైల్వే ప్రాజెక్టులకు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నప్పుడు మీరు ప్రోటోకాల్ పాటించరా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇప్పుడు మీరేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
అభివృద్ది పనుల విషయంలో అధికారులు కావాలనే ప్రోటోకాల్ పాటించటం లేదని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తుండగా, ఇప్పుడు కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా స్వయంగా రాష్ట్రమంత్రి ప్రోటోకాల్ అంశాన్ని ప్రస్తావించటం చర్చనీయాంశంగా మారింది.
గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుండి కిషన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందగా, టీఆర్ఎస్ నుండి పోటీ చేసిన తలసాని తనయుడు ఓటమి చవిచూశారు.