ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని ఆశ్చర్యంగా ఉన్నాయి. ప్రధానంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొందరు ప్రవర్తిస్తున్న విధానం ఆందోళన కలిగిస్తుంది. వినోదమే కాదు సోషల్ మీడియాలో చాలా మంది రకరకాల ఉపాధి కూడా వెతుక్కునే ప్రయత్నం చేస్తూ జనాల ప్రాణాలు తీస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియో లు చూసి మేము కూడా ఇలాగే చేస్తామనే పిచ్చిలో కొంతమంది ఉంటున్నారు.
ఇది ప్రజల ప్రాణాల మీదకు తీసుకొస్తుంది అనే మాట వాస్తవం. తాజాగా వరంగల్ జిల్లాలో ఒక ప్రబుద్దుడు ఒక దారుణం చేసాడు. అసలు ఏంటీ అంటే… హన్మకొండ కేంద్రంగా యూట్యూబ్ అబార్షన్స్ జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది హాట్ టాపిక్ అయింది. యూట్యూబ్ లో అబార్షన్ చూసి వైద్యుడిగా మెడికల్ రిప్రజెంటేటివ్ అవతారం ఎత్తి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. వచ్చి రాని వైద్యంతో మహిళల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాడు.
గర్భంలోనే చిన్నారులను ఈ నకిలీ డాక్టర్ చంపేస్తున్నాడు. అబార్షన్ కావాలి అని వెళ్తే అతను ఆస్పత్రి కంటే తక్కువ ఖర్చుతో చేయడమే కాదు ఒకవేళ అబార్షన్ అత్యవసరం అని అనుకుంటే… ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. మరి ఇంత చేసే వాడు సాధారణ వైద్యుడు అంటే ఎలా నమ్ముతారు. ఎంబీబీఎస్ వైద్యుడిగా చెలామణి అవుతున్నాడు అందుకే. అతను వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన ఇంద్రారెడ్డి అని పోలీసులు వెల్లడించారు.
చదివింది బీఎస్సీ… చేసేది అబార్షన్స్ అని పోలీసులు మీడియాకు వివరాలు చెప్పారు. అబార్షన్స్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా వెద్యాధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేయగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను దాదాపు 10 మంది మహిళలకు ఇలాగే చేసాడని గుర్తించినట్టు సమాచారం.