వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీ వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో ఆయన సాగించిన సంభాషణ తాజాగా వెలుగులోకి వచ్చింది. నీతో మద్యం తాగాలని కోరుకుంటున్నట్టు, నిన్ను కౌగిలించుకుందామని అనుకుంటున్నట్టు మహిళతో పృథ్వీ సాగించిన ఓ ఆడియో బహిర్గతం అయింది. ఈ ఆడియో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే ఈ విషయమై పృద్వీని సంప్రదించగా ‘నన్ను భ్రష్టుపట్టించడానికి’ ఇలా చేస్తున్నారని.. ఆ ఆడియో నకిలీదని సమాధానం చెప్పారు.