మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ లో ఉన్నాడా లేడా? కొంతమంది ఉన్నాడు అంటారు.. మరికొంతమంది లేడు అంటారు. ఇంకొంతమంది అయితే సెట్స్ పైకి వచ్చేశాడని ఏదేదో రాసేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చాడు.
సలార్ సినిమా కోసం మేకర్స్ తనను సంప్రదించిన మాట వాస్తవమేనని తెలిపాడు. అయితే.. తను ఇంకా ఎస్ లేదా నో చెప్పలేదంటున్నాడు. ఎందుకంటే, సలార్ చేయాలంటే తనకు ఓ కండిషన్ ఉందంట. అన్ని భాషల్లో ఈ సినిమాకు తానే డబ్బింగ్ చెప్పాలంటే.. ఎన్ని రీటేక్స్ అయినా తీసుకొని, అవసరమైతే ఆ భాష నేర్చుకొని మరీ చెబుతాడంట.
మరి.. సలార్ మేకర్స్ కు అంత టైమ్ ఉందా అంటున్నాడు పృథ్వీరాజ్. అందుకే ఈ ఆఫర్ ను తిరస్కరించాలని అనుకుంటున్నట్టు బాంబ్ పేల్చాడు. ఈ సందర్భంగా మరో రీజన్ కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పృధ్వీరాజ్ కాల్షీట్లు ఖాళీగా లేవంట. తన కోసం సలార్ టీమ్ ను వెయిట్ చేయించడం తనకు ఇష్టం లేదంటున్నాడు. మరీ ముఖ్యంగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్, తన కోసం వెయిట్ చేయడం తనకు నచ్చదంటున్నాడు.
ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చర్చలు జరుపుతున్నాడు పృథ్వీరాజ్. చర్చలు ఫలప్రదమైతే సెట్స్ పైకి వెళ్తాడు. లేదంటే ఆ స్థానంలో ఫహాజ్ ఫాజిల్ ను తీసుకోవాలనుకుంటున్నారట మేకర్స్.