ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి క్లాసిక్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం…పొన్నియిన్ సెల్వన్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, ఐశ్వర్యలక్ష్మి, త్రిష, ప్రభు, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, కిషోర్, జయరామ్, లాల్, రెహమాన్ తదితరులు నటిస్తున్నారు. ఇదిలా ఉండగా… మేకర్స్ ఓ అప్డేట్ ఇస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభం కావడంతో మద్రాస్ టాకీస్ సినిమా మొదటి భాగం 2022 సమ్మర్‌లో బిగ్ స్క్రీన్‌లలోకి రాబోతుందని ప్రకటించింది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్‌ల కింద అల్లిరాజా సుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.