ప్రధాని మోడీకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా, పరుగుల రాణి పీటీ ఉషాలు ధన్యవాదాలు తెలిపారు. తమను రాజ్యసభకు నామినేట్ చేయడంపై ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
‘ రాజ్యసభకు నామినేట్ చేసినందుకు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నాకు అప్పగించిన ఏ బాధ్యతనైనా నేను శ్రద్ధగా నిర్వర్తిస్తాను’ అని ఆమె ట్వీట్ చేశారు.
‘ ప్రధాని మోడీకి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన నాకు అప్పగించిన ఈ బాధ్యతను ఓ గొప్ప గౌరవంగా భావిస్తాను’ అని తెలిపారు.
అథ్లెట్ పీటీ ఉష, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, కర్ణాటకకు చెందిన వీరేంద్ర హెగ్డేలను రాజ్యసభకు నామినేట్ చేస్తూ కేంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి కోటాలో వీరిని రాజ్యసభకు కేంద్రం నామినేట్ చేసింది.