భారతీయుల డేటాను చోరీ చేస్తున్నారంటూ పలు చైనా యాప్ లపై భారత్ నిషేధం విధించింది. అలా నిషేధం ఎదుర్కొంటున్న యాప్స్ లో ఒకటి పబ్జీ. యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న పబ్జీ యాప్ మళ్లీ ఇండియాలో లాంచ్ కాబోతుంది. అవును… పబ్జీ మొబైల్ పేరుతో ఈ గేమింగ్ యాప్ భారత మార్కెట్ లోకి రానుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
పబ్జీ మదర్ కంపెనీ క్రాఫ్టన్ ఈ విషయాన్ని అధికారికకంగా ప్రకటించాల్సి ఉంది. అయితే… తమ యూట్యూబ్ ఛానల్ లో ఇచ్చిన అప్డేట్ ప్రకారం… భారత మార్కెట్ నుండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే, ఎప్పటి నుండి భారత మార్కెట్ లో ఉంటుందని చెప్పకపోయినప్పటికీ… రీలాంఛ్ కు భారత ప్రభుత్వం సుముఖంగా ఉన్నది నిజమేనన్న ప్రచారం ఊపందుకుంది.
రాబోయే రెండు నెలలు పబ్జీ ఇండియాకు మంచి అవకాశాలుంటాయి… పబ్జీ లవర్స్ కు కంగ్రాట్స్ అంటూ పబ్జీకి సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో పెట్టేవారు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.