హైదరాబాద్ కమటిపురాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కల్లు కాంపౌండ్ నిర్వాహకుడికి బస్తీ వాసులకు మధ్య వాగ్వాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. బస్తీలో కల్లు కాంపౌండ్ తీసేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల చాలామంది తాగుడుకు బానిసలు అవుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే కల్లు కాంపౌండ్ నిర్వాహకుడిని నిలదీశారు. అయితే అతను దౌర్జన్యానికి దిగాడు. బస్తీ వాసులనే బెదిరించాడు.
బయటి వారిని కూడా పిలిపించి కొట్లాటలు రేపుతున్నాడని ఆరోపిస్తున్నారు బస్తీవాసులు. వెంటనే కమటిపురా బస్తీలోకి కల్లు కాంపౌండ్ ను తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు స్పాట్ కు చేరుకుని కల్లు కాంపౌండ్ నిర్వాహకుడిని, పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు.