జీహెచ్ఎంసీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న టీఆర్ఎస్, ఎంఐఎం నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా జాంబాగ్ డివిజన్‌లో ఎంఐఎం అభ్యర్థి తరపున ఓట్లను అభ్యర్థించేందుకు వెళ్లిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి జనం నుంచి నిరసన సెగ తగిలింది.
ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని స్థానిక మహిళలు ఓవైసీని అక్కడే నిలదీశారు. వరదల సమయంలో వచ్చి పట్టించుకున్నవారే లేరని.. ఇప్పుడు మాత్రం ఓట్లు అడిగేందుకు వచ్చారా అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసదుద్దీన్ సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు వినలేదు. దీంతో ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెనుదిరిగారు. గ్రేటర్ ఎన్నికల్లో 52 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది.