మామూలుగా అయితే చేపలు పట్టడానికి చెరువులు, నదులు, కాలువల్లో వల విసురుతుంటారు. అదే.. నడిరోడ్డుపై వల విసిరితే పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. కానీ.. నిర్మాల్ జిల్లాలో అదే జరిగింది.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే నిర్మల్ రోడ్లపై చేపలు కొట్టుకొచ్చాయి. స్థానికులు గమనించి.. వాటిని పట్టుకునేందుకు పరుగులు పెట్టారు. కొందరైతే వలలు తీసుకొచ్చి రోడ్డుపైనున్న నీళ్లలో వేశారు. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.