ఢిల్లీలోని షహీన్ బాగ్ నడిరోడ్డు మీద నిరవధికంగా కొనసాగుతోన్న నిరసనపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. పబ్లిక్ రోడ్డు మీద నిరవధిక నిరసనలకు తావులేదని కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి, పోలీసు కు నోటీసులు జారీ చేసింది.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకిస్తూ షహీన్ బాగ్ లో గత దాదాపు రెండు నెలలుగా నిరసనలు కొనసాగుతున్నాయి. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 24 గంటలు రోడ్డుపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల కారణంగా ఢిల్లీ-నోయిడా వెళ్లే వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని…నిరసనకారులను అక్కడి నుంచి తొలగించాలంటూ బీజేపీ నేత ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ పై విచారించని కోర్టు నిరసనలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. నిరసనలు చేసే హక్కు ప్రజలకు ఉంది. అయితే ఒక కామన్ ఏరియాలో నిరవధిక నిరసనలు కుదరదు…నిరసనలు ఒక వేదికను గుర్తించారనుకుంటా అని సుప్రీంకోర్టు పేర్కొంది. విచారణను ఫిబ్రవరి 17 వ తేదీకి వాయిదా వేసింది.