జిల్..జిల్..జిల్.. జిగేల్ భామ పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్‌లో యూత్‌ఫుల్ హీరోయిన్. తాజా మూవీల్లో హీరో ఎవరైనా హీరోయిన్ మాత్రం పూజా హెగ్డేనే వుంటోంది..! పూజా హెగ్డే…గ్లామర్ స్టార్ ఆఫ్ టుడే అంటూ యూత్ అంతా అట్రాక్ట్ అయిపోతున్నారు. ఐదేళ్ళ తెలుగు కెరీర్‌లో పూజా హెగ్డే ఇప్పుడు బాగా బిజీ అయిపోయింది. ఒకప్పుడు శ్రీదేవి ఇలానే వరుస మూవీల్లో చేసి ఆలిండియా లెవల్లో స్టార్‌డమ్ తెచ్చుకుంది. ఇప్పుడు వయ్యారిభామ పూజా హెగ్డే సూపర్ హీరోయిన్ శ్రీదేవి రేంజ్ సాధించేందుకు కెరీర్ బిల్డప్ చేసుకొంటోంది. 2012లో ‘మొగ’ తమిళ్ మూవీ (తెలుగు డబ్బింగ్ మాస్క్)లో తన వాలు చూపుతో ఆకట్టుకుంది. యంగ్ కింగ్ నాగచైతన్య సరసన ఒక లైలా కోసం మూవీతో పూజా హెగ్డే తెలుగులో 2014లో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది. అది అంత గ్రాండ్ ఎంట్రీ కాకపోయినా అదే ఏడాది వరుణ్ తేజ్ సరసన ముకుంద మూవీలో మెరుపులా మెరిసింది. తర్వాత రెండేళ్లకు 2016లో వచ్చిన హిందీ మూవీ మొహంజొదారోలో హృతిక్ రోషన్ సరసన గ్లామరస్‌గా అందరినీ ఆకట్టుకుంది.
ఇక తెలుగులో 2017లో వచ్చిన దువ్వాడ జగన్నాధం మూవీలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే తన అందచందాలతో, హావభావాలతో ఇరగదీసింది. యూత్ మనసుల్నికొల్లగొట్టింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన 2018లో వచ్చిన అరవింద సమేత మూవీలో ఇక వెనక్కి చూసుకునే పని లేకుండా తారాపథంలోకి దూసుకుపోయింది, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన సాక్ష్యం మూవీలో కలర్ ఫుల్‌గా ఆకట్టుకున్న ఈ భామ అదే ఏడాది మెగా యూత్ స్టార్ రాంచరణ్ తేజ సరసన రంగస్థలం మూవీలో ఐటెమ్ గాళ్‌గా జిల్…జిల్..జిల్.. జిగేలు రాణిలా అదరగొట్టేసింది. క్లాస్…మాస్ అందరికీ కనువిందు చేసింది.
2019 ఆరంభంలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరసన మహర్షి మూవీలో పూజా హెగ్డే యువతను మైమరపించింది. ఈ ఏడాదే మరో రెండు పిక్చర్లలో అందచందాలతో మురిపించేందుకు రెడీ అయింది. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురములో సిన్మాలో అలకానందగా పూజా హెగ్డే అలరించనుంది. వరుణ్‌తేజ్ సరసన వాల్మీకిలో శ్రీదేవిగా పల్లెటూరి ఓణీలో సైకిల్ షికారుతో పూజా హెగ్డే ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేయనుంది.