సోమవారం బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ , అభిజిత్ మద్య జరిగిన మేక-పులి డైలాగ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అప్పటి వరకు టైటిల్ ఫేవరెట్ గా ఉన్న అఖిల్ ఈ డైలాగ్ కారణంగా డౌన్ కాగా….అభిజిత్ మరింత స్ట్రాంగ్ అయ్యాడు. ఒకవేళ అతడు టైటిల్ విన్నర్ అయితే …..దానికి కారణం మాత్రం ఈ సంభాషణే అవుతుందంటున్నారు నెటీజన్లు.
ఏం జరిగింది?
ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను హౌస్ నుండి బయటకు పంపించండనే బిగ్ బాస్ ఆర్డర్ మేరకు సభ్యులందరు కలిసి అఖిల్ ను పంపించారు. అలా బయటికి పంపించిన అఖిల్ ను బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ కు పంపడంతో అఖిల్ అక్కడి నుండి మిగితా సభ్యుల గేమ్ ను చూస్తూ ఉండిపోయాడు. ఈ క్రమంలో అభి…అఖిల్ ను ఉద్దేశిస్తూ….. కసాయి మేకకు గడ్డి చూపాడు, మేక లోపలికెళ్లిందంటూ తన గ్రూప్ సభ్యులతో చర్చ పెట్టాడు . దీన్ని దృష్టిలో పెట్టుకొని …..సోమవారం నాటి ఎలిమినేషన్ లో…..అఖిల్ అభిజిత్ ను నామినేట్ చేశాడు…ఇక్కడ ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది.
- అఖిల్ : అభి….. కసాయి గడ్డి చూపించి తీసుకుపోయిన మేకను ప్రొటీన్ పెట్టి పులిగా మార్చాడు ., అందుకే నేను కెప్టెన్ అయ్యి వచ్చాను.!
- అభి: బాబూ…మేక పులి అవ్వదు, బలి అవుతుంది.
ఈ కాన్వర్జేషన్ తో ……. అప్పటి వరకు స్ట్రాంగ్ అనుకున్న అఖిల్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో అభి కౌంటర్ ను హైలెట్ చేస్తూ మీమ్స్ చేస్తున్నారు.