జనవరి 17న జరగాల్సిన పల్స్ పోలియో కార్యక్రమం వాయిదా పడింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ వర్గాలు అన్ని రాష్ట్రాలకు సమాచారం ఇచ్చాయి.
ఈ నెల 16 నుండి కరోనా వ్యాక్సినేషన్ ను అత్యవసరంగా చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. సోమవారం ప్రధాని మోడీతో సీఎంల వర్చువల్ మీటింగ్ లో అధికారిక ప్రకటన చేయనున్నారు. దీంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. తదుపరి పల్స్ పోలియో ఎప్పుడన్నది త్వరలోనే నిర్ణయిస్తామని కేంద్రం సమాచారం ఇచ్చింది.