కరోనా వ్యాక్సినేషన్ కారణంగా వాయిదాపడిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించే విషయంపై స్పష్టత వచ్చింది. జనవరి 31న దేశవ్యాప్తంగా పోలియో చుక్కలు వేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. ఐదేళ్లలోపే చిన్నారులకు ఏటా జనవరిలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది కేంద్రం. ఈ ఏడాది కూడా జనవరి 17 నిర్వహించాలని మొదట నిర్ణయించింది. అయితే ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా టీకా వేసే కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందించింది. దీంతో రాష్ట్రపతి కార్యాలయం అనుమతితో పల్స్ పోలియో కార్యక్రమం తేదీని మార్చింది.
జనవరి 30న ఉదయం 11.45 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్ కొందరు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.