నవీ అలా చేస్తుందని అస్సలు ఊహించలేదు. అందరూ షాక్ అయిపోయారు. బిగ్‌బాస్ హౌస్‌లో పునర్నవీ చేసిన పనికి అందరూ షాకింగ్‌లోనే వున్నారు. ఇంకా తేరుకోలేదు.
ఇంతకీ నవీ ఏం చేసిందని అంటారా ? తన కోసం 20 గ్లాసుల కోసం కాకరకాయ రసాన్ని ఎత్తిన గ్లాస్ దించకుండా తాగేసిన రాహుల్ సిప్లిగంజ్‌కి కసుక్కున దగ్గరకు తీసుకుని కిసుక్కున కిస్సెట్టేసింది.
బిగ్‌బాస్ చూసేవాళ్లలో అన్ని రకాల ప్రేక్షకులు వుంటారు. కుటుంబ సభ్యులందరూ కూర్చుని చూసే ఎంటర్‌టైన్‌మెంట్ షో బిగ్‌బాస్. అలాంటి షోలో ‘ఇద్దరు ఆడా మగా కంటెస్టెంట్లు సడెన్‌గా రెచ్చిపోయి ముందూ వెనుకా చూసుకోకుండా అందరి ముందూ గట్టిగా కౌగిలించేసుకుని ముద్దులు పెట్టేసుకుంటే ఎలాగా? సెన్సార్ వుండద్దా అండీ..’ అని తిట్టిపోస్తున్నారు నెటిజెన్లు.
అక్కినేని నాగార్జున సొంత ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ క్యూటీ అండ్ బ్యూటీ నవీ ఇప్పటి వరకూ హౌసులో కాస్త డిగ్నిఫైడ్ గాళ్‌లా వుంది. ‘నువ్వింత హాట్ హాట్ సెన్షేషన్స్ క్రియేట్ చేస్తావని అస్సలు అనుకోలేదు సుమా..’ అంటూ జనం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు.
ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.. బిగ్‌బాస్ హౌస్‌లో కొద్దిరోజులుగా ఉప్పు నిప్పుగా వుంటున్న నవీ-రాహుల్ మధ్య అసలు ఎలాంటి ఫీలింగ్స్ వున్నాయో తెలుసుకోడానికి బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు.
ముందు నుంచీ ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని అందరూ అనుకున్నారు. సంథింగ్ సంథింగ్ నడుస్తోందని బిగ్‌బాస్ సొంత ప్రచార బృందంగా చెప్పబడే వ్యవస్థ సోషల్ మీడియా వేదికగా బాగా క్యాంపెయిన్ కూడా చేసింది. దాంతో ఈ ఇద్దరి మధ్యా మాంచి లవ్ ట్రాక్ నడుస్తోందని జనం కూడా నమ్మారు. దానికి తగ్గట్టే హౌసులో ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యే సీన్లు జరిగాయి. డేటింగ్‌పై ఇద్దరి మధ్య చర్చ కూడా నడిచింది. బిగ్‌బాస్ షో చూస్తున్న ప్రేక్షకులతో పాటు హోస్ట్ చేస్తున్న నాగార్జున.. గెస్ట్ హోస్ట్‌గా వచ్చిన రమ్యక్రిష్ణ.. ఇంకా తోటి హౌస్మేట్స్ అందరూ ఈ ఇద్దరి మధ్యా ఏదో వుందని అస్తమానూ పంచ్‌లు పేల్చేవారు.
ఇప్పుడీ ప్రేమ జంటకు పెద్ద పరీక్ష పెట్టాడు బిగ్‌బాస్. తొమ్మిదో వారం నామినేషన్స్‌లో భాగంగా.. పునర్నవి, రాహుల్‌లకు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ తెలుసుకునేందుకు ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చాడు.
గార్డెన్ ఏరియాలో ఉంచిన టెలిఫోన్ బూత్‌కి బిగ్‌బాస్ ఫోన్ చేసి పునర్నవితో ఈవారం ఎలిమినేషన్‌కి మీరు డైరెక్ట్‌గా నామినేట్ అయ్యారని చెప్పి.. దీన్నుంచి తప్పించుకోవాలంటే రాహుల్ మీ కోసం 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగాలని టాస్క్ ఇచ్చాడు. ఇప్పటికే తనతో గొడవపడి కోపంగా ఉన్న రాహుల్‌ని పిలిచి నాకోసం కాకరకాయ జ్యూస్ తాగాలట తాగుతావా? అని అడిగింది పునర్నవి.
నీకోసం కాకరకాయ రసం ఏంటి? విషం తాగమన్నా తాగేస్తా అని పైకి అనలేదు కానీ, మనసులో అనుకున్నాడో ఏమో రాహుల్.. వాంతులు చేసుకుంటూ మరీ 20 గ్లాసుల కాకరకాయ రసాన్ని పూన్నూ కోసం అమృతం తాగినట్టు తాగేశాడు. దీంతో పున్నూ ఫ్లాట్ అయిపోయింది. అతని ప్రేమకి ఫిదా అయిపోయింది. అంతే, రాహుల్‌ని దగ్గరకు తీసుకుని డీప్ హగ్ ఇచ్చేసింది. అంతటితో ఆగకుండా ఘాటు ముద్దు ఇచ్చేసింది పునర్నవి. ఇంటా బయటా బస్టాపుల్లో, కాలేజీల్లో ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ నడుస్తోంది. మొత్తం మీద బిగ్‌బాస్ ఈ టాస్కు ఇచ్చి సక్సెస్ అయ్యడు.