రెచ్చిపోయి హగ్గులు,,, పిచ్చెక్కే ముద్దులతో బిగ్‌బాస్ హౌసులో శృంగారం శ్రుతిమించింది. ఎర్రగడ్డ లవ్‌స్టోరీ పేరుతో బిగ్‌బాస్ ఇచ్చిన మరో టాస్క్.. ఆడియెన్స్‌ని నిజంగా మెంటల్ ఆస్పత్రికి షిఫ్ట్ చేసేలానే వుంది. బ్రీఫ్‌గా చెప్పాలంటే బిగ్‌బాస్ సీజన్ త్రీ కంటెస్టెంట్ల ఓవరాక్షన్‌తో బోరుకొట్టేస్తోంది. ఏమాత్రం ఇంట్రస్టింగ్‌గా వుండట్లేదని టాక్.
ఇక.. రీసెంట్ ఎపిసోడ్లలో స్టార్టయిన బిగ్‌బాస్ ఎక్స్‌ప్రెస్ జర్నీ మరీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చూడ్డానికి ఇబ్బందిగా ఉంది. ట్రైన్‌లో నవీ-రవీ ‘హనీమూన్ కపుల్’ పేరుతో బీ, సీ సెంటర్లలో ఆడే థర్డ్ గ్రేడ్ మలయాళ మూవీ చూపిస్తున్నారు. ఈ జర్నీ ఇండియా అంతా తిరిగేస్తూ.. మధ్య మధ్యలో అర్ధంపర్ధం లేని టాస్కులతో బోరింగ్‌గా సాగుతోంది. నవీ-రవి రెచ్చిపోతున్నారు. వీళ్లిద్దరి మధ్యా రొమాన్స్ బీభత్సంగా ఉంది. ఇంట్లో బూతు సినిమా చూసినట్టుండటంతో కుటుంబసభ్యులతో చూడ్డానికి జనం ఇబ్బంది పడుతున్నారు. నవీ-రవీ ఒకరి ఒళ్లో ఒకరు సెటిలైపోయారు.
రియల్ హనీమూన్ జంట కూడా ఇలావుండరని సోషల్ మీడియాలో వీళ్లిద్దరిపై బోలెడన్ని మీమ్స్ వస్తున్నాయి. హగ్‌లతో నవీ-రవీ శృంగార నైషధం రాస్తుంటే….మరో జంట శ్రీముఖి, అలీ లైనేసుకుంటూ ప్రేమలోకంలో ముచ్ఛట్లాడుకుంటున్నారు.
ఇది ఇలా వదిలేస్తే.. ఇక ‘స్టార్, కెమెరా, యాక్షన్’ అంటూ ఐదు నిమిషాల నిడివితో ఒక వీడియో తీయాలని బిగ్‌బాస్ హౌస్మేట్స్‌కి మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో లవ్, రొమాన్స్, యాక్షన్ ఎమోషన్స్ ఉండాలన్నది కండీషన్. ఈ టాస్క్‌లో బాబాభాస్కర్ డైరెక్టర్, కెమెరామెన్‌గా వరుణ్, అసిస్టెంట్‌గా రాహుల్, యాక్టర్లుగా శ్రీముఖి, హిమజ, రవి, అలీ, మహేష్ వున్నారు. వీరంతా రియల్ సిన్మా యూనిట్‌లా యాక్టింగ్ చేశారు. ఈ సిన్మా టైటిల్ ‘ఎర్రగడ్డ లవ్ స్టోరీ’ ఈ ఎర్రగడ్డ లవ్ స్టోరీ ఏమో కానీ.. చూసినవాళ్లకి నిజంగానే ఎర్రగడ్డ అవసరం పడేలా వుంది.
ఏమండీ.. నాగార్జున గారు.. చూస్తున్నారా… జనం పల్స్ తెలియడం లేదా.? ఈ ఎపిసోడ్లపై టన్నులకొద్దీ కమెంట్లు, మీమ్స్ పెడుతున్నారు చూడ్డం లేదా..? ఏం తీసినా.. ఏం చేసినా మేం చూడాలా..? ఆ చేపలు పట్టే టాస్క్ ఏంటండీ..? అంటూ అని ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు.
ఇక, స్విమ్మింగ్ ఫూల్‌లో చేపలు పట్టండని అలీ, రాహుల్‌లకు బిగ్‌బాస్ మళ్లీ ఓ టాస్క్ ఇచ్చాడు. కండల వీరుడు అలీ షర్ట్ తీసేసీ పూల్లో దూకి ఎక్స్‌పోజింగ్ చేశాడు. కొబ్బరికాయలకు పీచు తీయండని బాబాభాస్కర్, వరుణ్‌లకు మరో టాస్క్ ఇస్తే.. డాన్స్‌మాస్టర్ దాన్ని పంటితో తీసేశాడు. తమిళ్నాడులో అంతేనండీ..
‘ఛలో ఇండియా’ టాస్క్‌లో బాబా భాస్కర్, రాహుల్, వరుణ్ బెస్ట్ పెర్ఫామర్లుగా ఎన్నికయ్యారు. వీళ్లు ఈ వీక్ హౌస్‌కి కెప్టెన్సీకి పోటీదారులయ్యారు. బుదదలో పడి కొట్టుకుని గెలిచిన వారికే కెప్టెన్సీ అని మళ్లీ బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చారు. ఈ బురదలో పడి దొర్లి ఎవరో ఒకరు గెలుస్తారు. ఇదీ టోటల్‌గా బిగ్‌బాస్ బ్రీఫింగ్. బాగా బోర్ కొడుతోందని పబ్లిక్ టాక్.