చెడ్డీలు ఉతకమంటే ఉతకాలా? - Tolivelugu

చెడ్డీలు ఉతకమంటే ఉతకాలా?

ఒరేయ్ బిగ్‌బాస్… ఇటు రారా.. తేల్చుకుందాం.. అంటూ ఎంతో రేషనలిస్ట్ గోగినేని బాబు ఎంతో ఎమోషనల్ అయిపోయి అరచిన సీన్ గుర్తుందా? షోలో పిచ్చిపిచ్చి టాస్కులు ఇస్తే చేయనని, ఏంచేస్తావో చేస్తోమని బిగ్‌బాస్‌కే వార్నింగిచ్చిన ఆ సీరియస్ సీన్ పెద్ద కామెడీ మేమ్‌గా మారి ఇప్పటికీ జనం మధ్య తిరుగుతోంది.

ఇప్పుడు సేమ్ సీన్ బిగ్‌బాస్ సీజన్ 3లో రిపీటయ్యింది. ‘బిగ్‌బాస్ ఐతే మటుకు నాకేంటి..? నేనెందుకు భయపడాలి.. పిచ్చిపిచ్చి టాస్కులిస్తే నేను చేయను’ అంటూ పునర్నవి తిరుగుబాటు చేసింది. బిగ్‌బాస్‌కే చుక్కలు చూపిస్తోంది. 

బిగ్‌బాస్ హౌసులో తిరుగుబాటు పర్వం షురూ అయ్యింది. బీబీ ఇచ్చిన పిచ్చిపిచ్చి టాస్కులు చూసి పునర్నవీ ఫైరైపోయింది. పునర్నవి ఒక్కతే కాదండోయ్.. మహేష్‌ విట్టా కూడా బిగ్‌బాస్‌కు గట్టిగా రివర్స్ అయ్యాడు. టాస్క్‌లో చెత్త పర్ఫామెన్స్‌ ఇచ్చిన కంటెస్టెంట్లుగా పునర్నవి, మహేష్‌, శ్రీముఖి పేర్లు ప్రకటించి బీబీ వారి ముగ్గురికీ పనిష్మెంట్ ఇచ్చాడు.

ఆ ముగ్గురూ హౌసులో మిగిలిన కంటెస్టెంట్ల షూస్‌ పాలిష్‌ చేయాలి. ఇదీ ఆ పనిష్మెంట్. వేరే ఎవరివో షూస్ పాలిష్ చేయడానికి నవీ, మహేష్‌ ససేమిరా ఒప్పుకోలేదు. ఎదురు తిరిగారు. ఒకవేళ ఈ కారణంగా తనను ఎలిమినేట్‌ చేసినా పర్లేదంటూ పునర్నవి భీష్మించుకు కూర్చుంది. ‘ఇవీ ఓ టాస్కులా.. మీరే ఆడుకోండి’ అంటూ బిగ్‌బాస్‌పై ఫైర్‌ అయింది ఈ చిన్నది. ‘బిగ్‌బాస్‌.. నీవు కరెక్ట్‌ కాదం’టూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టాస్క్‌లు ఇస్తే కరెక్ట్‌గా ఇవ్వాలని సూచించింది. ఇంట్లో దెయ్యాలుగా మారిన హౌస్మేట్స్ ఏం చేసినా మనుషులుగా యాక్ట్ చేస్తున్న వాళ్లు అస్సలు రియాక్ట్‌ కాకూడదని బీబీ టాస్క్ ఇచ్చాడు. ఇదేం టాస్క్‌ అని నవీ నిలదీసింది.

ఇప్పుడు షూస్‌ పాలిష్‌ చేయమన్నాడు, రేపు చెడ్డీలు ఉతకమంటాడు.. ఏంటి ఈ టాస్క్‌లు ? అంటూ మహేష్‌ కూడా ఫైర్‌ అయ్యాడు. ‘ఏం పని లేకుండా ఇక్కడకు వచ్చామా? ఐనా, మా అంతట మేము వచ్చామా? మీరు రమ్మంటే వచ్చామా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టాస్క్‌లో భాగంగా తన బట్టలు చినిగిపోయాయని, అవన్నీ బిగ్‌బాస్‌ తిరిగి మళ్లీ పంపిస్తాడా? అంటూ మండిపడ్డాడు. ఐతే, అక్క శివజ్యోతి బుజ్జగించడంతో తమ్ముడు మహేష్‌ కాస్త వెనక్కి తగ్గాడు. పాలిష్‌ చేసి అవతల పాడేస్తా? కిరోసిన్‌ ఉంటే అన్నింటిని కాల్చేస్తా? అంటూ మొత్తానికి పాలిష్‌ చేసేందుకు రంగంలోకి దిగాడు.

శ్రీముఖికి ఇలాంటివేం పట్టవండి ! తీసుకున్న రెమ్యూనరేషన్‌కి ఏం చేయమన్నా చేయాలని అనుకుందో ఏమో.. బూట్లు పాలిష్ చేయడానికి రెడీ అయిపోయింది. నవీ అండ్ మహేశ్ వ్యవహారంపై బిగ్‌బాస్‌ కన్నెర్ర చేశాడు. హౌస్‌లో ఉన్న ఇంటి సభ్యులందరూ నా ప్రతీ ఆదేశాన్ని తప్పక పాటించాల్సిందేనని సడెన్‌గా బిగ్‌బాస్ ఎంటరై బ్యాగ్రౌండ్ వాయిస్‌లో వార్నింగిచ్చాడు. నేను చెప్పిందే శాసనం అనేట్టు బిల్డప్ ఇచ్చాడు. లేదంటే వచ్చేవారం నేరుగా నామినేట్‌ చేస్తానని వార్నింగ్‌ ఇచ్చాడు. దాంతో బెదిరి షూస్‌ పాలిష్‌ చేసేందుకు మహేష్‌, శ్రీముఖి ఓకే అన్నా…. పునర్నవి మాత్రం తన మాట మీద నిలబడింది. పునర్నవి విషయంలో బిగ్‌బాస్‌ వెనక్కు తగ్గుతాడా? లేదా? నెటిజన్లు మాత్రం పునర్నవీని బాగా సపోర్ట్ చేస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp