బిగ్ బాస్ సీజన్ 3తో పునర్నవి మరింత పాపులర్ అయింది. ప్రపంచ దేశాల్లోని తెలుగు వారికి బిగ్ బాస్ 3ద్వారా పున్ను బేబీ మరింత చేరువ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ ముద్దుగుమ్మ ఎలిమినేట్ అయినప్పటికీ…. చివరి వరకు పున్ను బేబీ ఉంటే బాగుండేందని అభిమానులు కోరుకున్నారంటే ఆమె ప్రదర్శన ఎంత మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. హౌస్ నుంచి బయటకు వచ్చాక అందరు అనుకున్నట్టే పునర్నవి సినిమాలో బిజీ అయిపోయారు. తాజాగా పునర్నవి ‘ఒక చిన్న విరామం’ సినిమాలో నటిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో పునర్నవితోపాటుగా సంజయ్ వర్మ .. నవీన్ .. గరిమా సింగ్ ప్రధానమైన పాత్రలను పోషించారు.
ఏ చిత్రం గురించి దర్శకుడు సందీప్ చేగూరి మాట్లాడుతూ సినిమాకు సంబందించిన విషయాలను చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా మంచి జోష్ ను ఇస్తుందని చెప్పుకొచ్చారు. కొత్తదనాన్ని కోరుకునే వారికీ ఖచ్చితంగా మంచి ఎంటర్ టైన్ మెంట్ ను ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే పున్ను బేబీకి ఈ సినిమా ప్లస్ అవుతుందని స్పష్టం చేశారు.