మేము లవర్స్ కాదు కానీ... రాహుల్‌పై పునర్నవి - Tolivelugu

మేము లవర్స్ కాదు కానీ… రాహుల్‌పై పునర్నవి

punarnavi Shocking comments on rahul, మేము లవర్స్ కాదు కానీ… రాహుల్‌పై పునర్నవి

ఉయ్యాలా జంపాల సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన పునర్నవి మంచి హిట్ అందుకుంది. ఆ తరువాత పెద్దగా సినిమాల్లో అవకాశాలు రాలేదు. కానీ బిగ్ బాస్ తో ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ షో పుణ్యమా అని ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు చేరువైపోయింది. ఇటీవల ఈ అమ్మడు ఒక టీవీ షోలో మాట్లాడుతూ ఉయ్యాలా జంపాల సినిమా తీసే సమయానికి నా వయసు 17 సంవత్సరాలు. ఒకవైపు వచ్చిన అవకాశాలను చేసుకుంటూ, మరో వైపు చదువుకోవటం వల్ల పూర్తిగా దృష్టి సారించలేకపోయానని, కానీ నేను ఇంకా చిన్నదాన్ని కాబట్టి మంచి అవకాశాలు వస్తాయని చెప్పుకొస్తుంది పునర్నవి.

మరో వైపు రాహుల్ తో ప్రేమ విషయంపై కూడా స్పందించిన పునర్నవి మేము ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇస్తాము అలా అని మేము లవర్స్ కాదు. మంచి స్నేహితులం అంటూ చెప్పుకొచ్చింది.

Share on facebook
Share on twitter
Share on whatsapp