ఢిల్లీ నుంచి పూణె వెళ్తున్న స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది.. విమానాన్ని అత్యవసరంగా ఆపారు. అనంతరం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు అధికారులు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరాల్సి ఉంది. అధికారుల సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనుగొనబడలేదు.
బాంబు బెదిరింపులతో ప్రయాణికుల బోర్డింగ్ ను ఆపి బాంబు స్క్వాడ్ విమానాన్ని తనిఖీ చేశారు. విమానంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు తేల్చారు. దీంతో అటు ఎయిర్‌పోర్టు సిబ్బంది, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా రెండు రోజుల ముందు మాస్కో-గోవా విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే ఎదురయ్యాయి. అంజూర్ ఎయిర్ విమానంలో గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ఈ మెయిల్ రావడంతో విమానాన్ని గుజరాత్ జామ్ నగర్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
విషయం తెలిసిన వెంటనే బాంబ్ స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు చేశారు. అయితే ఇది ఫేక్ కాల్ గా అధికారులు గుర్తించారు. అనంతరం విమానం గమ్యస్థానానికి చేరుకుంది.