లింగ సమానత్వం గురుంచి చెప్పేందుకు పుణేలోని పెర్గూసన్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు వినూత్న రీతిలో ప్రయత్నించి ప్రశంసలు పొందారు. చీరలు కట్టుకొని కాలేజ్ వార్షికోత్సవ వేడుకలో ప్రదర్శన నిర్వహించారు. వారు చేసిన ఈ ప్రయత్నానికి కాలేజ్ యజమాన్యంతోపాటు పలువురు సామాజిక సంఘాల నాయకులు ఆ ముగ్గురి విద్యార్థులను ప్రశంసిస్తున్నారు. ఆడవాళ్ల చీరకట్టు గురించి అవమానిస్తున్న ఈ కాలంలో ఇలా చీరలను కట్టుకొని లింగ సమానత్వం ప్రచారం చేయటంపై పెర్గూసన్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రదర్శన చేయడం హర్షణీయమని కొనియాడుతున్నారు.
ప్రతి ఏటా పెర్గూసన్ కాలేజీ వార్షిక వేడుకల్లో ఏదో ఒక థీమ్‌ను ఎంచుకొని విద్యార్థులు ప్రత్యేక వస్త్రధారణలో వస్తుంటారు. అయితే ఈ ఏడాది ‘టై అండ్ శారీ డే’ పేరుతో థీమ్‌ను ఎంచుకొని కాలేజీ యాజమాన్యం వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలకు కాలేజ్ విద్యార్థులు వివిధ వస్త్రాధారణలో రెడీ అయి వచ్చారు. కాగా అదే కాలేజ్ లో ఆకాశ్ పవార్, సుమిత్, రుషికేష్ సనాప్‌లు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించి చీరలు ధరించి ఆడవాళ్లలాగా తయారై కాలేజీకి వచ్చారు. మొదట వారిని చూసిన వారంతా నవ్వుకున్నారు. హేళన చేశారు. కానీ వారు ఏ దృక్పథంతో చీరలను ధరించారో తెలిశాక అందరూ వీరిని ప్రశంసించారు. ఇది సామజిక కార్యక్రమమని చెప్పుకొచ్చారు.
Advertisements
మగవారు ప్యాంట్, షర్ట్ లను ధరించాలని ఎక్కడా ఎవ్వరు చెప్పలేదు. అలాగే ఆడవారు చీరలను ధరించాలని చెప్పలేదు. అందుకే లింగ సమానత్వంపై అవగాహనా కల్పించేందుకు ఆ థీమ్ ను ఎంచుకున్నామని వారు చెప్పారు. ఆడవారు చీరలను ధరించేందుకు ఎంతలా ఇబ్బంది పడుతారో తెలుసుకునాని చెప్పికొచ్చారు. చీర కట్టుకొని నడుస్తున్న సమయంలో చీర జారిపోతున్నదని అప్పుడు మా స్నేహితురాలు శ్రద్ధ సహాయం తీసుకున్నామని ఓ విద్యార్ధి తెలిపారు. అలాగే మేకప్ విషయంలో ఆడవారు ఎందుకు అంత సమయాన్ని కేటాయిస్తారో అర్థమైందని తెలిపారు. చీరకట్టుపై ఆకాశ్ పవార్, సుమిత్ హోన్వాడజ్కర్, రుషికేష్ సనాప్ ల ప్రదర్శన అక్కడి వారిని ఆలోచింపజేసింది.