హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను మేకలు తింటున్నాయని చెప్పి యజమానికి జరిమానా, మేకలకు సంకెళ్లు విధించారు మున్సిపల్ అధికారులు.
కరీంనగర్: ఓ పర్యావరణ ప్రేమికుడు మొక్కలు తింటున్న మేకలను పోలీసు స్టేషన్‌లో అప్పగించగా.. మేకల యజమాని వచ్చాక వెయ్యి రూపాయల జరిమానా విధించి మేకలను వదిలేశారు అధికారులు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. హైస్కూల్ మైదానంలో మూడు నెలల క్రితం నాటిన మొక్కలను మేకలు తిన్నాయి. మళ్లీ మొక్కలను నాటినప్పటికి మళ్లీ తింటున్నాయి. ఇది గమనించిన పర్యావరణ ప్రేమికుడు అనిల్ వాటిని పట్టుకుని పోలీసు స్టేషన్‌లో అప్పగించి.. మేకల యజమాని వస్తే జరిమానా విధించాలని పోలీసులను కోరాడు. అయితే మేకలను పోలీసు స్టేషన్‌లో కట్టేసిన పోలీసులు మేకల యజమానిని పిలిపించి స్థానిక మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. మేకల యజమానికి వెయ్యి రూపాయల జరిమానా విధించి మేకలను వదిలేశారు అధికారులు.