రిపబ్లిక్ డే రోజున రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు ట్రాక్టర్ల ర్యాలీ చేశారు. అయితే, ఇందులో పంజాబ్ నటుడు దీప్ సిద్దూ రైతులను, సానుభూతిపరును ప్రభావితం చేసి ఎర్రకోటవైపు మళ్లించాడని, ట్రాక్టర్ల ర్యాలీలో హింసకు తనే కారణమని ఢిల్లీ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు.
కానీ తన ఆచూకీ లభించకపోవటంతో… దీప్ సిద్దూ ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల నజరానా ఇస్తామని పోలీస్ శాఖ వెల్లండింది. జనవరి 26నుండి పరారీలోనే తనను ఢిల్లో పోలీసులు పంజాబ్ లో అరెస్ట్ చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారు. దీన్ని ఢిల్లీ పోలీసులు అధికారికంగా దృవీకరించారు.
దీప్ సిద్దూ తన ఆస్ట్రేలియా ఫ్రెండ్ తో టచ్ లో ఉన్నాడు. తను వీడియోలు చేస్తూ… తనకు పంపిస్తుండగా, తను అక్కడి నుండి వీడియోలు అప్ లోడ్ చేసింది. ఇది గమనించి దర్యాప్తు చేయగా తన ఆచూకీ తెలిసినట్లు ఢిల్లీ పోలీస్ వర్గాలంటున్నాయి.