పంజాబ్‌లోని ఆప్ సర్కార్ కు ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీ బీజేపీ నేత తేజిందర్ బగ్గా, ప్రముఖ కవి కుమార్ బిశ్వాస్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ లను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు తీర్పునిచ్చింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కల్పితమైన, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత తేజిందర్ బగ్గాపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఆ ట్వీట్లను తేజిందర్ పంజాబ్ లో చేయలేదని హైకోర్టు వెల్లడించింది.
ఆయన చేసిన ట్వీట్లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవని హైకోర్టు పేర్కొంది. రాజకీయాల్లో ఉన్నవారు ఒకరిపై మరొకరు వాక్చాతుర్యం చేసుకోవడం పరిపాటేనని తెలిపింది. ఇది ఎలాంటి హిస్టీరియాను వ్యాపింపజేయదని హైకోర్టు చెప్పింది.
అరవింద్ కేజ్రీవాల్ ఖలీస్తానీ అనుకూల వ్యక్తి అంటూ వ్యాఖ్యలు చేశారని ప్రముఖ కవి కుమార్ బిశ్వాస్‌పై రోవర్‌లో కేసు నమోదైంది. దీంతో విచారణకు హాజరు కావాలని ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాటిని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో వాదనలు విన్న హైకోర్టు ఎఫ్ఐఆర్ ను కొట్టి వేస్తూ తీర్పు వెల్లడించింది.