పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి నుంచి వైద్యులు ఆయన్ని గురువారం ఉదయం డిశ్చార్జ్ చేశారు.
డిశ్చార్జ్ సమయంలో ఆయన వెంట ఆయన భార్య, సోదరి ఉన్నారు. సీఎంకు కడుపులో నొప్పిగా అనిపించడంతో బుధవారం ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు.
దీంతో ఆయనకు డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. 24 గంటల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మాన్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం పరామర్శించారు. మాన్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.