పంజాబ్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీఎం పదవికి రాజీనామా చేశారు అమరీందర్ సింగ్. గవర్నర్ భన్వరీలాల్ ను కలిసిన ఆయన రాజీనామాను సమర్పించారు.
పంజాబ్ కాంగ్రెస్ లో కొంతకాలంగా సంక్షోభం కొనసాగుతోంది. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. అధిష్టానం చక్కబెట్టే ప్రయత్నాలు చేసింది. అయితే రోజురోజుకు తనకు ఎదురవుతున్న అవమానాలను తట్టుకోలేక అమరీందర్ రాజీనామా చేసినట్లు ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. గవర్నర్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన కూడా అదే చెప్పారు. మూడోసారి తనకు అవమానం జరిగిందని చెప్పారు. అందుకే రిజైన్ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ కు తన నిర్ణయాన్ని చెప్పినట్లు వెల్లడించారు అమరీందర్.
పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ హరీష్ రావత్ అర్ధరాత్రి ట్వీట్ చేస్తూ.. ఎమర్జెన్సీ మీటింగ్ ఉంటుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ రావాలని కోరారు. దీంతో అమరీందర్ రాజీనామా చేస్తున్నారని ఊహాగానాలు వచ్చాయి. అనుకున్నట్లే ఆయన సీఎం పదవికి రిజైన్ చేశారు. కొన్ని నెలల్లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.