తెలంగాణలోని సిద్ధిపేటలో కొండపోచమ్మ రిజర్వాయర్ ను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ పరిశీలించారు. సీఎం కేసీఆర్ తో కలిసి గురువారం రిజర్వాయర్ ను సందర్శించారు.
కొండపోచమ్మ సాగర్ పరిశీలన అనంతరం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మర్కుక్ మండలం ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల మధ్యనున్న చెక్ డ్యామ్ ను కూడా పరిశీలిస్తారు.
ఆ తర్వాత మల్లన్ సాగర్, గజ్వేల్ పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చెందిన పాండవుల చెరువునుని పరిశీలిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ కు వెళ్తారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన.. పంజాబ్ సీఎం సిద్ధిపేటలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, నీటి పారుదల ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు.