సింగర్, పంజాబ్ కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాల కుటుంబాన్ని ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ శుక్రవారం పరామర్శించారు. సిద్దూ మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు.
ముఖ్యమంత్రి రాక సందర్బంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సిద్దూ కుటుంబ సభ్యులను పరామర్శించేందు వచ్చిన స్థానికులను, బంధువులను పోలీసులు అనుమతించలేదు.
దీంతో స్థానికులు నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆప్ ఎమ్మెల్యే కల్పించుకుని వారికి సర్ధి చెప్పారు. పోలీసుల తరఫున తాను క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు.
సిద్దూ మృతి పట్ల ఆప్ సర్కార్ పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. సిద్దూ మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సిద్దూ తండ్రి లేఖ రాశారు.