పంజాబ్ కాంగ్రెస్ లో ఏర్పడిన వివాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వర్గాల మధ్య ఉన్న వివాదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన సీఎం రాజీనామా యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
సాయంత్రంలోపు కెప్టెన్ అమరీందర్ సింగ్ తన రాజీనామాను గవర్నర్ కు ఇవ్వబోతున్నారని, ఈ సాయంత్రమే కెప్టెన్ వారసుడి ఎన్నిక ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ హరీష్ రావత్ అర్ధరాత్రి ట్వీట్ చేస్తూ… ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ రావాలని కోరారు. దీంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి పీసీసీ చీఫ్ సిద్ధూ కూడా మద్ధతు పలికారు. దీంతో కెప్టెన్ సాబ్ రాజీనామా కోసమేనా అన్న చర్చ సాగుతుంది.