పంజాబ్ ను కరోనా సెకండ్ వేవ్ వణికిస్తుంది. చూస్తుండగానే వందల్లో కూడా లేని కరోనా కేసుల సంఖ్య వేలకు చేరింది. దీంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కేసులు అధికంగా ఉన్న 12 జిల్లాల్లో విధించిన రాత్రి 9గంటల నుండి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూను రాష్ట్రమంతా విస్తరించారు.
అంతేకాదు పెళ్లిళ్లు, అంత్యక్రియలు ఏవైనా సరే 50మందికి మించరాదని ఆదేశించారు. ఎలాంటి రాజకీయ ర్యాలీలు, మీటింగ్ లకు అనుమతి లేదని… కాదని నిర్వహిస్తే కఠినమైన విపత్తు నిర్వహణ ఉల్లంఘన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశించారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలను మూసివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించారు. ఇక మాల్స్ లో జనం ఒకేసారి 10మందికి మించి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని… ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుల్లో మాస్క్ తప్పనసరి ధరించాలని ఆదేశించారు.
పంజాబ్ లో కొత్తగా వస్తున్న కేసుల్లో 85శాతం కేసులు యూకే స్ట్రెయిన్ గా గుర్తించారు.