ఖలిస్తాన్ ఉద్యమ సానుభూతిపరుడు, పంజాబ్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ పర్సన్ సరబ్ జీత్ కీరత్ ఎట్టకేలకు చిక్కాడు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సరబ్ జీత్ కోసం పంజాబ్ పోలీసులు ఎప్పటి నుంచో వెతుకుతున్నారు.ఈ క్రమంలోనే మహారాష్ట్రలో తలదాచుకున్నాడని సమాచారం అందింది. దీంతో నాందేడ్ పోలీసులు, పంజాబ్ పోలీసులు కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో సరబ్ జీత్ పట్టుబడ్డాడు. ప్రస్తుతం పంజాబ్ తరలిస్తున్నారు.
సరబ్ జీత్ కొన్నేళ్లుగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ.. పంజాబ్ లో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని, యువతను రెచ్చగొడుతున్నాడని పంజాబ్ పోలీసులు ఆరోపిస్తున్నారు. అటు లక్నోలోనూ యూపీ పోలీసులు, పంజాబ్ పోలీసులు కలిసి ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాదులకు సన్నిహితుడిగా పేరొందిన జగ్దేవ్ సింగ్‌ను కూడా అరెస్ట్ చేశారు.