మొహాలీ పేలుడు ఘటనపై బీజేపీ నాయకుడు మజిందర్ సింగ్ సిర్సా స్పందించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆయన విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మొహాలీ పేలుళ్లు చాలా బాధాకరమైన ఘటన అని అన్నారు. పాటియాల ఘర్షణల తర్వాత ఇప్పుడు ఇంటెలిజెన్స్ భవనంపై దాడి జరిగిందని అన్నారు. ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
తజిందర్ పాల్ బగ్గా వెంట పోలీసులు పడుతున్నారు. పోలీసులు తమ దృష్టిని బీజేపీ నేతలపై కాకుండా రాష్ట్ర భద్రతపై కేంద్రీకరించాలని ఆయన సూచించారు. పంజాబ్ సరిహద్దు రాష్ట్రమని, శాంతియుత రాష్ట్రాన్ని కేజ్రీవాల్ తన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని అన్నారు.
అంతకు ముందు పేలుళ్లపై సీఎం మాన్ స్పందించారు. పంజాబ్ లో ప్రశాంత వాతావరణాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆయన ట్వీట్ ను షేర్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు.