తుపాకులు, తల్వార్లతో పోలీస్ స్టేషన్ ముట్టడిపంజాబ్ అమృత్ సర్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారీస్ పంజాబ్ దే అధినేత అమృత్ పాల్ మద్దతుదార్లు వేలాది మంది తుపాకులు, తల్వార్లతో అజ్నాలా పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టారు. తల్వార్లతో పోలీసులపై దాడి చేస్తూ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లారు.
అమృత్ పాల్ సింగ్ సన్నిహితుడు లవ్ ప్రీత్ తుఫాన్ అరెస్టుకు నిరసనగా మద్దతుదార్లు ఆందోళనకు దిగారు. నిరసనకారుల్ని కట్టడి చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. లవ్ ప్రీత్ తుఫాన్ ను పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెడుతున్నారని అమృత్ పాల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అమృత్ పాల్ సింగ్ తన అనుచరులతో కలిసి జల్ పుర్ ఖైరా ప్రాంతం నుంచి అజనాలేకు భారీ ర్యాలీగా బయల్దేరారు. అక్రమంగా అరెస్ట్ చేసిన లవ్ ప్రీత్ ను విడుదల చేయకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని పోలీసులను హెచ్చరించారు.