పంజాబీ యాక్టర్ అమన్ ధలివాల్‌పై అమెరికాలో దాడి జరిగింది. జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తున్న సమయంలో అమన్ పై ఓ వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఓ వైపు గాయాలతో రక్తమోడుతున్నా.. సదరు వ్యక్తి దాడి చేయకుండా చేతిని పట్టుకున్నాడు అమన్.
ఆ తర్వాత అదును కోసం చూస్తూ ఒక్కసారిగా నిందితుడిపై దాడి చేశాడు. ఆ తర్వాత దాడికి పాల్పడిన వ్యక్తిని మరికొందరు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతను అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తున్నారు.
అయితే నటుడిపై దాడికి గల కారణాలు తెలియరాలేదు. ఆ తర్వాత అమన్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. మెడతో పాటు చేతులకు కత్తి గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా.. అమన్ స్వస్థలం పంజాబ్ లోని మాన్సా.
Punjabi singer Aman Dhaliwal attacked in US
*Singer sustained sharp edged weapon in juries
*Motive behind attack was yet to be known #punjabisinger pic.twitter.com/NcZQyuWsfV— Aishwarya Kapoor (@aishkapoor) March 16, 2023
హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ జంటగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘జోథా అక్బర్’తో పాటు పలు పంజాబీ సినిమాల్లోనూ నటించాడు అమన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.