ప్రముఖ సింగర్ దలేర్ మెహందీ అరెస్ట్ అయ్యారు. 2003లో మానవ అక్రమ రవాణా కేసులో పంజాబ్‌లోని పాటియాలా కోర్టు ఈయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రొబేషన్‌పై విడుదల కోసం దాఖలు చేసిన దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. వెంటనే పంజాబ్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. జైలుకు తరలించారు.
మానవ అక్రమ రవాణా కేసులో పంజాబీ సింగర్ దలేర్ మెహందీ అప్పీల్‌ను పాటియాలా అదనపు సెషన్స్ జడ్జి తోసిపుచ్చింది. 2018లో అక్రమంగా వ్యక్తుల తరలింపు కేసులో ట్రయల్ కోర్టు 2 సంవత్సరాల శిక్ష విధించింది. ఆ తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. ప్రొబేషన్‌పై విడుదల చేయాలని ఆయన చేసిన దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించింది.
2003లో దలేర్ మెహందీపై మానవ అక్రమ రవాణా కేసు నమోదు అయింది. దలేర్ మెహందీ పలు దేశాల్లో ఈవెంట్స్ కి వెళ్లినపుడు తన వెంట కొంత మంది వ్యక్తులను తాత్కాలిక వీసాలతో ఆయా దేశాలకు తీసుకెళ్లి అక్కడే వదిలేసేసారు. ఇందులో దలేర్ మెహందీతో పాటు ఆయన సోదరుడు షంషేర్ పాత్ర ఉంది.
ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడాలనుకునే వ్యక్తులను టార్గెట్ చేస్తూ.. అక్కడ వదిలిపెట్టి రావడానికి ఇక్కడ తగినంత డబ్బును దలేర్ మెహందీ తన సోదరుడితో కలిసి దండుకునేవారని పోలీసులు అభియోగం మోపడంతో పాటు వాటిని సాక్ష్యాలతో సహా ఋజువు చేసారు. దీంతో జైలుపాలయ్యారు.