ఢిల్లీ అంటేనే దేశ రాజధాని కన్నా ముందు కాలుష్యమే గుర్తుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. వీవీఐపిలుండే చోట గాలి కూడా కరువైందనే విమర్శ నిజంగా ఆందోళనకరమే. అయితే… ఇండియాలో దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటే అదే కాసులు కురిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి అమ్మకానికి పెట్టేశారు.
ఆక్సిప్యూర్ పేరుతో ఢిల్లీ సాకేత్‌లో ఓ ఆక్సిజన్ బార్ ఓపేన్ అయింది. స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించటమే ఇక్కడ స్పెషల్. పైగా మాములు గాలినే ఇస్తే ఏం బాగుంటుంది అనుకున్నారో ఏమో… గాలికి కూడా రుచిని ఆడ్ చేశారు నిర్వాహకులు. ఈ స్వచ్ఛమైన గాలిని లెమన్, ఆరెంజ్, పెప్పర్‌మింట్, సినమిన్ ఇలా దాదాపు ఏడు ఫ్లేవర్లలో అందిస్తోంది.
ఇప్పుడు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఫుల్ ఫేమస్ అవుతోంది.